తెలుగు ప్రాంతాల్లో ఆరెస్సెస్ చరిత్ర… పుస్తకావిష్కరణ కార్యక్రమం

తెలుగు ప్రాంతాల్లో ఆరెస్సెస్ చరిత్ర అనే పుస్తకావిష్కరణ సభ బెంగాల్ లో జరిగింది. ఖడగ్ పూర్ లోని షిర్డీ మందిరంలో ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం ప్రారంభంలో బాలికలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే నృత్యం, కోలాట ప్రదర్శన కూడా ఇచ్చారు. సాంస్కృతిక కార్యక్రమాల తర్వాత సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం జరిగింది. దీని తర్వాత పుస్తకావిష్కరణ జరిగింది.
rss2
ఈ కార్యక్రమానికి సామాజిక సమరసత వేదిక అఖిల భారతీయ సంయోజక శ్యాంప్రసాద్, డా. బెనర్జీ, తపస్ భట్టాచార్య, పాల్గొన్నారు. పుస్తకావిష్కరణ తర్వాత నిర్వాహకులు పుస్తకాన్ని పరిచయం కూడా చేశారు.ఈ కార్యక్రమంలో మొత్తం 375 మంది పాల్గొన్నారు. వీరిలో 175 మంది మహిళలున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *