శబరిమల ఆదాయం 440 కోట్లు..

శబరిమల అయ్యప్ప స్వామి మండలం మకర విలక్కు సీజన్ ముగిసింది. జ్యోతి దర్శనం అయిన తర్వాత సంప్రదాయం ప్రకారం దేవాలయాన్ని మూసేశారు. అయితే.. ఈ సీజన్ లో స్వామి వారికి 440 కోట్ల ఆదాయం వచ్చింది. గతేడాదితో పోలిస్తే 86 కోట్లు అధికంగా వచ్చాయని ట్రావెంకోర్ దేవస్థానం ప్రకటించింది. గత యేడాది 354 కోట్లు రాగా, ఈ యేడాది 440 కోట్లు వచ్చాయని పేర్కొంది. సాధారణంగా యేడాదికేడాదికి ఆదాయం పెరగడం సాధారణమే కానీ… ఈ సారి 4 నుంచి 5 కోట్ల మేర పెరిగిందని బోర్టు పేర్కొంది. మరోవైపు ఈ సారి మొత్తం 55 లక్షల మంది అయ్యప్ప స్వాములు శబరిమలైకి వచ్చారని, భక్తుల సంఖ్య గతంతో పోలిస్తే అయిదున్నర లక్షల మంది అధికంగా వచ్చారని పేర్కొంది. ఇక.. ఉత్సవాల నిర్వహణకు 147 కోట్లు ఖర్చైందని కూడా తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *