వరద ప్రాంతాల రైతు కుటుంబాలకు బీకేఎస్ అండ
అసోంలోని శివసాగర్ జిల్లాలో విపరీతమైన వరదలు సంభవించాయి. అనేక మంది నిరాశ్రయులయ్యారు. పంట నష్టం కూడా అంతే స్థాయిలో సంభవించింది. దీంతో సాధారణ ప్రజానీకం బతుకులు అత్యంత అస్థవ్యస్థమయ్యాయి. ఈ నేపథ్యంలో భారతీయ కిసాన్ సంఘ్ (BKS) మానవతా హృదయంతో స్పందించి, వరద బాధితులకు సహాయ కార్యక్రమాలు చేపట్టింది. కిసాన్ సంఘ్ నాయకత్వంలో, జిల్లాలోని ఇతర 15 సామాజిక సంస్థలు మరియు ‘సెయుజి బసుంధర మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీ’ సహకారంతో, వరద ప్రభావిత ప్రాంతాలకు చెందిన 7,000 మంది విద్యార్థినీ విద్యార్థులకు నోటు బుక్కులు, స్కూల్ యూనిఫాంలు, పెన్నుల సెట్లు, స్కూల్ బ్యాగులతో పాటు ఇతర సామాగ్రిని పంపిణీ చేశారు. శివసాగర్ జిల్లాలో 100 కు పైగా పాఠశాలల్లో ఈ పంపిణీ చేశారు.
ఇటీవల సంభవించిన తీవ్రమైన వరదలు ఈ జిల్లాలోని వందలాది కుటుంబాల ఇళ్లను ధ్వంసం చేయడంతో పాటు, వ్యవసాయ భూములను ముంచెత్తి, జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. ఈ విపత్తు పిల్లల విద్యపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పిల్లల మనోధైర్యాన్ని పెంపొందించడానికి మరియు వారి విద్యకు ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగేలా చూడటానికి ఈ సహాయ కార్యక్రమాన్ని బీకేఎస్ ప్రారంభించింది.
ఈ సహాయక చర్యల్లో భాగంగా 230 మంది విద్యార్థులకు పాఠశాల యూనిఫాంలు పంపిణీ చేశారు. బెట్బారి ప్రాంతంలోని శంకర్‌దేవ్ శిశు విద్యా నికేతన్‌లో 120 జతలు, జయరాపర్ మిడిల్ అస్సామీస్ పాఠశాలలో 40 జతలు, కోమర సందికై ప్రాథమిక పాఠశాలలో 30 జతలు మరియు దేవ్బిల్ బనువా ప్రాథమిక పాఠశాలలో 40 జతలు పంపిణీ చేశారు.రాజ్‌బారీ ప్రాథమిక పాఠశాల మరియు జయరాపర్ జనకల్యాణ్ ప్రాథమిక పాఠశాలల్లోని మరో 120 మంది నిరుపేద విద్యార్థులకు కూడా స్కూల్ యూనిఫాంలు పంపిణీ చేశారు.
“వరద విపత్తు కారణంగా కుటుంబాల ఆర్థిక పరిస్థితి దెబ్బతింది, అలాగే చాలా మంది పిల్లలు తమ పుస్తకాలు మరియు దుస్తులను కోల్పోయారు. భారతీయ కిసాన్ సంఘ్ మరియు సామాజిక సంస్థలు చేపట్టిన ఈ కార్యక్రమం పిల్లల ముఖాల్లో తిరిగి చిరునవ్వులు పూయించింది. ఇది కేవలం వస్తువుల పంపిణీ మాత్రమే కాదు, సమాజ భవిష్యత్తును తీర్చిదిద్దే దిశగా ఒక నిబద్ధత.” అని ఓ పాఠశాల ఉపాధ్యాయుడు తెలిపారు.ఈ సంక్షోభ సమయంలో సహాయం అందించడానికి ముందుకు వచ్చిన భారతీయ కిసాన్ సంఘ్ మరియు సెయుజి బసుంధర మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీలకు సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు తమ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
అలాగే బీకేఎస్ నేరుగా రైతులకు కూడా వరద సహాయక చర్యలు చేసింది. లఖింపూర్, జోర్హాట్, దిబ్రూగఢ్, ధేమాజీ, మోరిగావ్, నల్బారీ మరియు కామరూప్ జిల్లాల నుండి 200 మందికి పైగా BKS కార్యకర్తలు వరద ప్రభావిత ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. వీరు సహాయక సామగ్రి పంపిణీ నుండి ఇళ్ల పునర్నిర్మాణం వరకు అన్ని పనుల్లోనూ సహాయపడుతున్నారు.వ్యవసాయ కుటుంబాలకు వరదల వల్ల కలిగే నష్టంతో పాటు పంటలు కూడా నీటిలో మునిగిపోయాయి. దీంతో చేతికి వచ్చిన వచ్చినట్లే వచ్చి పోయిందని రైతులు తెగ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరందర్నీ బీకేఎస్ ఓదారుస్తోంది. వారందరికీ అండగా నిలబడుతోంది. తాము వున్నామని ధైర్యాన్ని చెబుతోంది. వరదల వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు వరి నారును సమకూర్చి పంపిణీ చేయడం ద్వారా, వరద నీరు తగ్గిన వెంటనే వారు తిరిగి సాగును ప్రారంభించేలా చేసింది. కేవలం శివసాగర్ జిల్లాలోనే, ఈ ప్రయత్నం సుమారు 1,500 బిఘాల వ్యవసాయ భూమిలో తిరిగి పంటలు వేయడానికి దోహదపడుతుందని అంచనా; దీనివల్ల తమ వరి పంటను కోల్పోయిన 600 మందికి పైగా రైతులకు ప్రయోజనం చేకూరనుంది.
ఈ మద్దతు శివసాగర్‌కే పరిమితం కాలేదు. పొరుగున ఉన్న జోర్హాట్ జిల్లాలోని ‘టియోక్’ (Teok) ప్రాంతంలో, BKS మరో 100 మంది రైతులకు కూడా బీకేఎస్ చేస్తోంది. సుమారు 170 బిఘాల భూమిలో వరి సాగును పునరుద్ధరించడంలో సహాయపడేందుకు వారికి వరి నారును అందించింది. అలాగే బీకేఎస్ ముఖ్యంగా మహిళా రైతులకు అండగా నిలబడింది. వరద బాధితులైన 50 మంది మహిళా రైతులకు ఒక క్వింటాల్ పుట్టగొడుగుల విత్తనపు పొట్టును పంపిణీ చేశారు. దీనివల్ల వారు త్వరగా తిరిగి ఆదాయం సంపాదించుకోవడానికి ఒక మార్గం లభించింది, ఎందుకంటే వరి సాగులాగా పుట్టగొడుగుల సాగుకు నెలల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేదు.
శివసాగర్‌లోని వరద ప్రభావిత గెలెకి ప్రాంతానికి చెందిన చిన్న స్థాయి టీ తోటల పెంపకందారులను కూడా బీకేఎస్ సహాయం చేసింది. తమ టీ తోటలను తిరిగి కోలుకునేలా చేయడంలోనూ, భవిష్యత్తులో వాటిని సుస్థిర పద్ధతుల్లో నిర్వహించడంలోనూ సహాయపడేందుకు వీరిలో 50 మందికి జీవ ఎరువులు మరియు జీవ పురుగుమందులు అందజేశారు. కేవలం రైతులే కాకుండా, రైతు కుటుంబాలకు చెందిన పిల్లలు తమ విద్యను కొనసాగించడంలో కూడా ‘కిసాన్ సంఘ్’ సహాయం చేస్తోంది.