మన చిప్ లు విదేశాల్లోనూ అందుబాటులో వున్నాయి : ప్రధాని మోదీ
న్యూఢిల్లీ : దేశాన్ని సెమీకండక్టర్ల రంగంలో ప్రపంచ స్థాయి కీలక కేంద్రంగా తీర్చిదిద్దే క్రమంలో తీసుకోదగ్గ చర్యలన్నింటినీ తీసుకుంటున్నామని ప్రధానినరేంద్ర మోదీ ప్రకటించారు. ఢిల్లీలో ‘‘సెమికాన్ ఇండియా’’ సదస్సును ప్రారంభించారు. ప్రపంచ ఉత్పాదక రంగంలో భారత్ విశ్వసనీయ ప్రత్యామ్నాయ కేంద్రంగా ఎదిగిందన్నారు. తొలిసారిగా భారత్ లో తయారైన చిప్ లు వినియోగదారులకు అందుబాటులోకి రావడం ప్రారంభమైందని, భారత్ లో తయారైన చిప్ లు భారత్ లోనే కాకుండా విదేశాల్లోనూ అందుబాటులో వున్నాయన్నారు. భారత్ సెమీ కండక్టర్ మిషన్ 2.0 కింద ప్రభుత్వం కేటాయింపులను భారీగా పెంచిందని మోదీ తెలిపారు.