పాకిస్తాన్ కి చెందిన 319 మందికి భారత పౌరసత్వం ఇచ్చిన గుజరాత్
పాక్ నుంచి వలస వచ్చి గుజరాత్ లో తలదాచుకున్న 319 మందికి భారత పౌరసత్వం లభించింది. తాము చాలా సంవత్సరాలుగా భారత పౌరసత్వం కోసం వేచి చూస్తున్నామని, ఇప్పుడు పౌరసత్వం లభించిందని వారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారత పౌరసత్వంతో తమ జీవితాల్లో కొత్త అధ్యాయం మొదలైందన్నారు. రాజ్ కోట్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గుజరాత్ డిప్యూటీ సీఎం హర్ష్ సింఘ్వీ వారందరికీ భారత పౌరసత్వ ధ్రువపత్రాలను అందజేశారు.
‘‘ఇకపై మీరంతా అధికారికంగా భారతీయులే’’ అని డిప్యూటీ సీఎం ప్రకటించగానే.. వారి కళ్లల్లో ఆనంద భాష్పాలు వచ్చేశాయి. ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయం, సీఏఏ వల్లే ఇది సాధ్యమైందని ప్రకటించారు. ఈ చట్టం ద్వారా శరణార్థుల జీవితాల్లో భద్రత, కొత్త ఆశలు, ఆశయాలు చిగురించాయని అన్నారు. పాక్ లో హిందూ కుటుంబాలు, ముఖ్యంగా మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇప్పుడు భారతీయ పౌరసత్వం రావడంతో వారు ఎవరికీ భయపడాల్సిన పనే లేదని, అసలైన పేర్లతో, ఆత్మగౌరవంతో బతకవచ్చని డిప్యూటీ సీఎం ప్రకటించారు.