మెంతి ఆకు
ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఒక్కో కూర ఒక్కో గుణాన్ని కలిగి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అందులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలిచ్చే మెంతికూర గురించి తెలుసుకుందాం.
ఈ మెంతులు ఆశ్వయుజ కార్తీక మాసాల్లో చల్లితే చల్లిన నెలా పదిహేను రోజుల్లొ మెంతికూర ఉపయోగించడానికి అనువుగా ఎదుగుతాయి.
నల్లనేలల్లో శీతాకాలంలో వేసిన మెంతికూర చాలా రుచిగా ఉంటుంది.
మెంతికూర పచ్చిగా ఉన్నప్పుడుకాని, ఎండపెట్టి వరుగు చేసికాని ఉపయోగించుకోవచ్చు.
జ్వరం, వాంతి, వాతరక్తం, కఫం, దగ్గు, వాయువు అంటే వాతం, మూత్రరోగం, క్రిమి, క్షయ, శుక్రం వీటిని నశింపచేస్తుంది. కీళ్ల నొప్పులు పోగొడుతుంది.
ఈ ఆకులు నూరిన ముద్ద కాలిన పుండ్లకు, వాపులకు పట్టువేస్తే చల్లగా ఉండి మేలు చేస్తుంది.
మెంతి ఆకులు నూరి ముద్దకడితే వెంట్రుకలు మృదువుగా అవుతాయి. వెంట్రుకలు రాలడం తగ్గుతుంది.
మెంతి ఆకుల్లో ఇనుము అధికంగా వుంటుంది. స్త్రీల గర్భాశయాన్ని బాగు పరచడంలో, ఋతు స్రావాన్ని సుష్టు చేయడంలో బాగా పనిచేస్తుంది.
మెంతి వల్ల కలిగే దోషాల్ని పోగొట్టడానికి పులుపు వస్తువులు వాడాలి.
– ఉషాలావణ్య పప్పు